హరితహారం అంటూ హంగులు- పండ్ల మొక్కలు ఏవి…? : కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

0
31

జగిత్యాల తాజా కబురు :హరిత హారంలో నాటిన ప్రతీ మొక్క పచ్చదనానికి పరిమితం కాకుండా ఫలాలు అందించే విధంగా ఉండాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం రాయికల్ మండలంలోని రాయికల్,ఇటిక్యాల్ ,అల్లీపూర్,భూపతిపూర్ ,ఒడ్డెలింగాపూర్ పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో రోడ్డు కు కిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు.అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు పని కల్పించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అట్టి నిధులతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి గుంతలు,మొక్కలు నాటడం,నీరు అందించడం,సంరక్షణ,కూలి ఖర్చులు చెల్లిస్తున్నారన్నారు.రాజీవ్ రహదారి,జాతీయ రహదారి,రాష్ట్ర రహదారులు వంటివి రెవెన్యూ, గ్రామ పరిధిలోకి వస్తాయని అలాంటి రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు నీడనిచ్చే మొక్కలు కాకుండా ఫలాలు అందించే మొక్కలు మామిడి,పచ్చడి మామిడి,జామా,సపోటా ,అల్లానేరెడీ,సీతాఫలం లాంటి రకరకాల మొక్కలు నాటితెే 5 సంవత్సరాల తర్వాత ఆదాయంతోపాటు పచ్చదనం పెరుగుతుందన్నారు.అత్యధికంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళలు పాల్గొంటున్నారని రోడ్డుకు ఇరువైపులా నాటిన పండ్ల మొక్కలను కిలో మీటర్ చొప్పున ఆయా గ్రామ పంచాయితీ ఆధీనంలోని ముదిరాజ్ కులస్తులకు,మహిళా సంఘాలకు మొక్కల ఎదుగుదల సంరక్షణలను కల్పించవచ్చన్నారు .మహిళా సంఘాలు,ముదిరాజ్ కులస్థులు,ఆయా గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా లబ్ధితో పాటు జీవనోపాధి చేకూరుతుందన్నారు.గడిచిన 5 సంవత్సరాలలో రోడ్డుకు ఇరువైపులా ఫలాలు అందించే మొక్కలు నాటలేదని ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదన్నారు. ఇప్పటికైనా హరిత హారంలో నాటెే ప్రతీ మొక్క ఫలాలు అందించే విధంగా ఉండాలని వివరించారు.గీత కార్మికులకు ఈత వనం ఏర్పాటు ,చెరువుల్లో మత్స్యకారులకు చేపల పెంపకం అలాగే రోడ్డుకు ఇరువైపులా నాటెే పండ్ల మొక్కలను మహిళా సంఘాలకు, ముదిరాజ్ కులస్థులకు దత్తత హక్కు కల్పిస్తే చెట్లను సంరక్షించుకుంటారని సూచించారు.హరితహారం కార్యక్రమం ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు కాకుండా నిర్మాణాత్మకంగా ఉపాధి కి ఉపయోగపడే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఉద్ఘాటించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఉపాధి కల్పించే హక్కు ,ఆహార భద్రత ,గరీబ్ కల్యాణ్ యోజన పథకాలను చేపట్టి నిరుపేదలకు అండగా ఉందన్నారు.ప్రతి పౌరుడు ప్రభుత్వ పథకాల అమలు తీరు ఖర్చులు,వ్యయం తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు.హరిత హారంలో నాటిన ఎడాకుల మొక్కలతో శ్వాస కోశ వ్యాధులు వస్తాయని ప్రజలు తొలగించినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్ రావు, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్ ,జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యేడి మహిపాల్,నాయకులు ఎద్ధండి దివాకర్,మ్యాకల రమేష్,కొమ్ముల ఆదిరెడ్డి,మున్ను,మండ రమేష్,జలేందర్ రెడ్డి,మసూద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here