“దళిత బంధు” మాదిరిగా “మేదరి బంధు” అమలు చేయాలి: మహేంద్ర సంఘం అధ్యక్షులు చిలివేరి నాగరాజు

0
23

జగిత్యాల తాజా కబురు : ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ మండలంలోని రామోజీ పేట గ్రామంలో శనివారం మహేంద్ర మేదరి సంఘ సభ్యులు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చిలివేరి నాగరాజు మాట్లాడుతూ అడవిలోకి వెళ్లి వెదురుబొంగును తీసుకొచ్చి తడకలు,గుల్లలు,గంపలు, చేటలు మరెన్నో కష్టమైన పనులు చేస్తారని మేదరులు కూడా కళా నైపుణ్యాలతో అల్లికలు చేస్తున్నారని ఇకనైనా ప్రభుత్వాలు ఆదరించాలని ఆయన కోరారు.50 సంవత్సరాలు దాటిన ప్రతి మహేంద్రుడికి మహేంద్ర పింఛన్ 2016 రూపాయలు ఇవ్వాలని,”దళిత బంధు” మాదిరిగా “మేదరి బంధు” అమలు చేసి ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వాలని,మహేంద్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, గతంలో మేదర ఫెడరేషన్ ద్వారా రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న గ్రూపులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని,మేదర కులస్తులకు ప్రభుత్వం సబ్సిడీతో మోటార్ సైకిళ్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని,ప్రభుత్వం మేదర కులస్థులకు వృత్తిలో నైపుణ్య శిక్షణ ఇప్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పూరి సురేష్,గంగాధర్ రాజేష్ ,వెంకటేష్, అనిల్ ,రాజేందర్ ,వెంకటేష్ , గoగస్వామి,నరసయ్య, శ్రీధర్, రామకృష్ణ ,వికాస్,ముత్యాలు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here