హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యవహింరిచకూడదు-బీజేవైఎం మండల అధ్యక్షులు గోస్కి మధు

0
82

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రం లో కేంద్ర రాష్ట్ర చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రకృతిని,పశు సంపదను కాపాడి చట్టాలను ఉల్లంఘన చేసిన వారిపై చర్యలు తీసుకోవలని బీజేవైయం ఆధ్వర్యంలో సోమవారం పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సంధర్బంగా బీజేవైఎంమండల అధ్యక్షులు గోస్కి మధు మాట్లాడుతూ ఇప్పటి వరకు మేడిపల్లి మండలం లో అన్నిమతాల వారు సోదర భావంతో కలిసి ఉన్నామని, ఇక పై కూడా అలాగే ఉండాలని ఎవరు హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యవహింరిచకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్,యువమోర్చా జిల్ల ప్రధాన కార్యదర్శి క్యాతం మహేందర్,బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,మామిడి ధర్మారెడ్డి అధికార ప్రతినిధి రఘు,ఐటి సెల్ మండల కన్వీనర్ సాయి కుమార్, దోనిపాల శంకర్,చెరుకు శ్రీనివాస్,జంగ మధు జీవన్ రెడ్డి ,భారత్, రాము, అరుణ్,పరశురాం,కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here