నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది: బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతం మహేందర్ రెడ్డి

0
53

జగిత్యాల తాజాకబురు: మేడిపల్లి మండల కేంద్రంలో నిరుద్యోగులకు బాసటగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో, షూ పాలిస్ చేసి నిరసన వ్యక్తం చేశారు . ఈ సంధర్బంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులని చూస్తే కేసీఆర్ కు ఎందుకు ఇంత సంతోషం అని, 7సంవత్సరాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందుతున్నారని,నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని,తెలంగాణ రాష్ట్ర యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతుందని, రానున్న బీజేపీ ప్రభుత్వంలో వచ్చే రామరాజ్యం చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు గోస్కి మధు, అధికార ప్రతినిధి దాసరి రఘు,దోనిపాల శెంకర్,గడ్డం శ్రీనివాస్,తోపారపు గణేష్,నాగేల్లి మహేష్,జంగమధు,భాస్కర్, జలెంధర్,అరుణ్, పాండు,చంటి,రాజశేఖర్,పవన్,మహేష్,పెద్దిమధు,సతీష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here