బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

0
62

తాజా కబురు తెలంగాణ: కరోనా రూల్స్ ఉల్లంఘించారని రిమాండ్ రిపోర్టు ఇవ్వడం కరెక్ట్ కాదన్న హైకోర్టు.. బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్ ను కొట్టివేసింది.సంజయ్ ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని.. అరగంటలో కేసు,అరెస్ట్ , రిమాండ్ చేయడంలో మీ ప్రత్యేక శ్రద్ధ ఏంటని పోలీసులను ప్రశ్నించింది. మీరు పెట్టిన 333 సెక్షన్ అక్రమమే ,ఎఫ్​ఐఆర్ లో నుండి ఆ సెక్షన్ తొలగించాలని..చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపజేయాలని ఆదేశించింది.బండి సంజయ్ ను రిలీజ్ చేయాలని జైళ్లశాఖ డీజీకి ఆదేశమిచ్చింది. రెండు విషయాలలో పోలీసులను తప్పబట్టింది హైకోర్టు. పోలీస్ అధికారి ముందు అరెస్టు తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం తప్పని భావించింది హై కోర్ట్. రాత్రి 10:50 అరెస్టు ఆ తర్వాత రాత్రి 11 గంటల 15 నిమిషాలకుఎఫ్ఐఆర్ సరైంది కాదని భావించింది. కుడిచేయి వేలికి గాయమైంది అని చెప్పి ఎఫ్ఐఆర్లో సెక్షన్ 333 అదనంగా చేర్చారని.. కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం ఇంకా మెడికల్ రిపోర్ట్ అందాల్సి ఉందని పోలీసులు చెప్పారని కోర్టు గ్రహించింది. కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే 17 వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైంది కాదని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 7 కు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here