5న ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలి

0
28
chalo-collectarate

జగిత్యాల ఏప్రిల్01,తాజా కబురు:: మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామా పరిధిలోని చక్కర చక్కెర కర్మాగారంను పున ప్రారంభించి చెరుకు రైతులను ఆదుకోవాలని చెరుకు రైతు ఉత్పత్తి దారుల జిల్లా అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, రైతు ఐక్య వేదిక అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమం లో భాగంగా జగిత్యాల పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు కరోనా నిబంధనలు పాటిస్తూ, పాద యాత్రగా బయలు దేరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందేంచేందుకు చెరుకు రైతులు అధిక సంఖ్యలో తరలి రావాలని గురువారం రాయికల్, మేడిపల్లి మండలంలోని పలు గ్రామాల రైతు సంఘాల నాయకులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు కంది బుచ్చిరెడ్డి, రాగుల లింగారెడ్డి, నాగిరెడ్డి సంతోష్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ఎస్ఎన్. రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ రెడ్డి, రాజారెడ్డి, నారాయణ రెడ్డి, మహిపాల్ రెడ్డి, స్వామి రెడ్డి, తిరుపతి రెడ్డి రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here