మిత్రుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన 2003-04 వివేకవర్ధిని విద్యార్థులు

0
49

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన జవ్వాజి నర్సయ్య గత 2 నెలల క్రితం కరోనా సోకి మరణించగా అతనితో పాటుగా 10వ తరగతి చదువుకున్న 2003-04 బ్యాచ్ మిత్రులు నర్సయ్య కుటుంబానికి 1 లక్ష 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కాగా ప్రస్తుతం అతనికి ఒక కూతురు ఉండగా 10వ తరతి వరకు మండల కేంద్రంలోని వివేకవర్ధిని పాఠశాలలో ఉచితంగా చదివిస్తామని పాఠశాల కరస్పాండెంట్ కె. సత్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నర్సయ్య మిత్ర బృందం నాగమల్లి శిరీష,ఎండి నాహేద,మోత్కూరి శ్రీనివాస్, పోతవేణి ప్రవీణ్, పోతవేణి శేఖర్, చంద వినయ్, జవాజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here