స్మైల్ పథకాన్ని మరుగున పడేసిన కేసీఆర్ సర్కార్

0
19

కరీంనగర్ తాజా కబురు: కోవిడ్తో ఓబీసీ,ఎస్సీ కుటుంభాల యాజమాని మరణిస్తే 5 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందించాలనే దృఢ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా ప్రవేశపెట్టిన స్మైల్ పథకాన్ని కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం మరుగున పడేసి వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు తీవ్ర అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. సంవత్సరానికి 3 లక్షల లోపు ఆదాయం ఉండి కరోనాతో చనిపోయిన వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాల ఇంటి యజమాని లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాలకు ఆర్ధికంగా చేయుతనిచ్చేందుకు ప్రధాని మోదీ స్మైల్ పథకం క్రింద 5 లక్షల లోన్, లక్ష రూపాయల సబ్సిడీతో జూన్ 7వ 2021 రోజున కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు ఉత్తర్వులు జారీ చేసినారని ఈ 5 లక్షల లోన్ జాతీయ వెనుకపడిన తరగతుల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.బి.సి. ఎఫ్.డి.సి) మరియు జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.ఎఫ్.డి.సి) ల ద్వారా లోన్లు అందజేయ బడుతాయని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాల్సిన కేసీఆర్ స ర్కార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 20 రోజుల ఆలస్యంగా మెమో నెంబర్ 1226/డి/2021 ద్వారా 23 జూన్ 2021 రోజున 4 రోజుల గడువుతో అనగా 27 జూన్ 2021 రోజు లోపు దరఖాస్తులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయగా,కరీంనగర్ జిల్లా కలెక్టర్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు స్మైల్ పథకం దరఖాస్తులు 26 జూన్ 2021 లోపు తీసుకోవాలని చివరి తేదని తెలుపుతూ 24 జూన్ 2021 రోజున పత్రిక ప్రకటన ద్వా రా తెలుపడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.కానీ తెరాస ప్రభుత్వ అసలు రంగు ఇక్కడే బయటపడింది,జి ల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, కరీంనగర్ వారు లేఖ నెంబర్ ఏ/982 /2020,25 జూన్ 2021 రోజున పత్రిక ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు స్మైల్ స్కీం యొక్క దరఖాస్తులు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయం,కరీంనగర్ నందు స్వీకరించడం లేదని తెలిపినారు.ఇక్కడే కేసీఆర్ సర్కారు స్మైల్ పథకాన్ని అమలు కాకుండా అడ్డుపడి తన నిజస్వరూపాన్ని బయటపెట్టినాడని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణ రా ష్ట్రంలో స్మైల్ పథకాన్ని అమలు చేస్తే కేంద్రంలోని మోదీ సర్కారుకు మంచి పేరు వస్తదని,అలాగే తెలంగాణలో కరోనాతో మరణించిన సంఖ్య బయటపడుతుందని,ఇదే కాకుండా త్వరలో జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో ఓబీసీ,ఎస్సీ ఓటర్లు అధి కంగా ఉండడంతో ఈ స్మైల్ పథకం జిల్లాలో అమలు చేస్తే తెరాసకు ఇబ్బందులు తప్పవని భావించే కేంద్రం ప్రవేశ పెట్టిన స్మైల్ పథకాన్ని కరోనాతో మరణించిన ఓబీసీ,ఎస్సీ యజమానుల కుటుంబాల నుండి ఒక్క దరఖాస్తు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మైల్ స్కీంను దక్కనియకుండా చేసి తీవ్ర అన్యాయం చేసినారని బేతి మహేందర్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు.కేంద్రం జూన్ 7న మార్గదర్శకాలు ఇస్తే,తెరాస ప్రభుత్వం 20 రోజులు ఆలస్యంగా జిల్లాకు ఉత్తర్వులు ఇచ్చి, జిల్లా అధికారులు 2 రోజుల్లో దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి తిరిగి ఒక రోజు గడవక ముందే దరఖాస్తులు స్వీకరించడం లేదని చెప్పినారంటే తెరాస సర్కార్ అసలు రంగు ఇక్కడే బయటపడిందని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఒకవేళ కరీంనగర్ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుండి ఏమైనా స్మైల్ స్కీం దరఖాస్తులు తీసుకున్నారో,లేదో ఒకవేళ తీసుకుంటే ఎన్ని దరఖాస్తులు కేంద్రానికి పంపినారో ప్రజలకు తెలిసే విధంగా మీడియా ద్వారా బహిర్గతపరచాలని,లేని పక్షంలో ఈ విషయం పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి కరోనాతో చనిపోయిన బడుగు,బలహీన వర్గాల,షెడ్యూల్ కు లాల కుటుంబసభ్యులకు ఈ స్మైల్ పథకంలో భాగస్వాములు చేసి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ సర్కార్ పై న్యాయ పోరాటం చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here