సైబర్‌ క్రైం పోలీసుల కస్టడీలోకి తీన్మార్‌ మల్లన్న

0
3
Tajakaburu

హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ను సైబర్‌ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్లన్నను ఒక్కరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా.. ధర్మాసనం ఆ మేరకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ప్రశ్నించనున్నారు. డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు గత నెల 27న మల్లన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈ నెల 9 వరకు రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి ఆయన చంచలగూడ జైలులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here