సూరమ్మ ప్రాజెక్ట్ పనుల జాప్యం పై బీ.జే.పి నాయకుల నిరసన

0
68

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం లోని వరద కాలువ నుండి సూరమ్మ ప్రాజెక్టు లిప్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని గత సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇచ్చి, ఈరోజు వరకు కూడా సూరమ్మ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇవ్వకపోవడంను నిరసిస్తూ కథలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భాజపా నాయకులు వరద కాలువ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు.ఈ సంధర్బంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు, ప్రజలకు అందుబాటులో ఉండక నియోజకవర్గం లో అభివృద్ధి కుంటు పడిపోయిందని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ వరద కాలువకు లిఫ్టులు ఏర్పాటు చేస్తామని, సూరమ్మ చెరువు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం,తర్వాత మరిచిపోవడం విడ్డురంగా ఉందని, త్వరితగతిన వాటి నిర్మాణాలు చేపట్టాలని, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామని ఇంజనీర్లతో వచ్చి పేపర్లు తిప్పడం తప్ప పని చేసింది ఏమి లేదని, స్థానిక తెరాస నాయకులు కూడా లక్కాకుల చెరువుకు లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇస్తామని దానిద్వారా రాళ్ల వాగు ప్రాజెక్టు గొలుసు చెరువులు అన్నింటికీ కూడా ఎత్తిపోతల ద్వారా నీరు ఇస్తామని ప్రగతి భవన్ సీఎం ఆఫీసు చుట్టూ తిరిగి మీటింగ్లు పెట్టి పేపర్లకు పోజులిచ్చారు తప్ప చేసింది ఏమీ లేదని ప్రజలను మభ్య పెట్టడం అలవాటుగా మారిందని అన్నారు. పనులు చేయకపోతే బీజేపీ తరపున త్వరలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు కంటే సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జిల్లా రాజు,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, అంబటి పురుషోత్తం, గాంధారి శ్రీనివాస్,బద్రి సత్యం, కాసోజి ప్రతాప్, బూదగుండ్ల నాగభూషణం, కిశోర్, మహేష్, సాయి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here