రాయికల్ తాజా కబురు: పట్టణం లోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య అధికారి శ్రీనివాస్ గురువారం మండల, గ్రామా స్థాయి అధికారులు, ప్రజాప్రతిధులకు సీజనల్ వ్యాధులను అరికట్టుటకు, కోవిడ్ – 19 కరోనా వైరస్వ్యాప్తిని గురించి సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
గ్రామా స్థాయిలో ప్రజలకు హెల్త్ సూపర్ వైసర్లు, అంగన్ వాడి సూపర్ వైజర్లు, పంచాయతి కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు రాబోవు వర్షకాలములో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టుటకు, కోవిడ్ – 19 కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యములో ప్రతి గ్రామ పంచాయతిలో, ప్రజల ఆరోగ్యమును కాపాడుటకు ప్రత్యేక శ్రద్ద వహించి పారిశుద్ధ్య కార్యక్రమములు నిర్వహించుచు దోమల నివారణకై అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్లి నీటి నిలువ ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రపరుచుకునేట్లు ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.