సర్పంచ్ “భర్త ను”, సర్పంచ్ అని పిలవమన్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

0
86


సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఫిర్యాదు ప్రతి..

అలా పిలవాలని ఎవరు అనలేదు-అదనపు ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజేంధర్

తాజా కబురు డెస్క్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామానికి చెందిన తునికి నాగరాజు అతని పట్టా 234 సర్వే నెంబర్ గల భూమిలో మామిడి మొక్కలు నాటడం కోసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద గుంతలు తీయాలని దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల క్రితం భూమి వివరాల కోసం మండల ఎపిఓ మోకా పైకి వచ్చిన సందర్భంలో ఫోటో తీయాలని, సర్పంచ్ భర్తని, సర్పంచ్ అని పిలవాలంటూ మండల ఏపీఓ నాగరాజుతో అన్నారని, అతను అలా పిలవడానికి అంగీకరించకపోవడంతో అలా పిలువక పోతే గుంతలు తవ్వే పని జరుగదని అక్కడి నుండి ఏపీఓ వెళ్లిపోయారని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలనీ కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విషయం పై మా ప్రతినిధి అదనపు ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజేంధర్ ను వివరణ కోరగా మోకాపైకి వెళ్లిన విషయం వాస్తవమే కానీ అలా పిలవాలని మోకపై ఎవరు అనలేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here