రైతు వేదిక ను ప్రారంభించి,నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ..

0
10

జగిత్యాల రూరల్: మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించి, ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రైతు భీమా చెక్కు అందజేసి, అనంతరం జగిత్యాల రూరల్ మండల నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారుఎమ్మెల్యే డా.సంజయ్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత లు

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యక్రమమని,రైతులు ఇలాంటి వేదికలను, అధికారులను ఉపయోగించుకొని రైతులు అభివృద్ధి చెందటానికి, ఉపయోగించుకోవాలని అన్నారు., రైతును రాజును చేసే ఉద్దేశం తోనే అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని అన్నారు., కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని దాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా లేఖలు కూడా రాసారని అన్నారు., నూతన రేషన్ కార్డ్ ల ద్వారా పేదలకు లబ్ధిచేకూరుతుందని అన్నారు., దేశంలో ఎక్కడలేని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయని ప్రజలు గమనించాలని అన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో మొత్తంగా 13 రైతు వేదికలను ప్రారంభించుకున్నామని, ఎంపీపీ గంగారాం గౌడ్ మరణం పార్టీ కి తీరనిలోటని ఈ సందర్భంగా గుర్తు చేశారు,, ముఖ్యమంత్రి రైతులకోసం 24 గంటల కరెంట్, రైతు భీమా, రైతు బంధు,కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరానికి సాగు నీరందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు, ఈ ప్రభుత్వం పైసలకోసం ప్రాజక్టులు కట్టదని ప్రజలకోసం ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ మని అన్నారు.వరద కాలువను జీవనదిలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి గారిదని అన్నారు.నియోజకవర్గంలో,48 కోట్లతో చెరువులను అభివృద్ధి చేసుకున్నామని తద్వారా భూగర్భజలాలు పెరిగాయని అన్నారు,చెక్ డ్యామ్ ల నిర్మాణాల ద్వారా ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టె విధంగా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని,గతంలో నియోజకవర్గంలో 50 వేల ఎకరాలలో పంటలు వేస్తే నేడు 80 వేల ఎకరాలలో పంట సాగు అవుతుందని త్వరలోనే 90 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని అన్నారు,ప్రతి 5 వేల ఎకరాలకు వ్యవసాయ అధికారులను నియమించుకున్నామని, వారి సేవలను ఉపయోగించుకొవడానికే రైతు వేధికలని అన్నారు.
40 లక్షలతో పొలాస ఫామ్ లో భూమి లో పోషక విలువల పరీక్ష కేంద్రం ద్వారా భూమి సారవంతాన్ని అంచనా వేయవచ్చని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు, తెలంగాణ లో కోటి ఎకరాలు దాటి 1 కోటి 30 లక్షల ఎకరాలకు సాగు చేస్తున్నదంటే ముఖ్యమంత్రి కృషి వల్లనే అని అన్నారు.


ఒక్క చలిగల్ గ్రామములో రైతు బందు ద్వారా ప్రతి ఏటా 3 కోట్లు, రైతు భీమా ద్వారా 45 లక్షలు లబ్ది పొందారని అన్నారు., రైతులు వరి పంట మాత్రమే కాకుండా ఇతర పంటలు, కూరగాయల సాగు కూడా చేయటం ద్వారా లాభాలు వస్తాయని, వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని,పట్టణంలో మార్కెట్లను అభివృద్ధి చేసుకుంటున్నామని,చలిగల్ మ్యాంగో మరియు
పండ్ల మార్కెట్ పనులు చివరి దశలో ఉన్నాయని అన్నారు., ఈ వేధికలలో రైతుల కోసం ఎమ్మెల్యే నిధుల నుండి 13 క్లస్టర్ లలో ప్రోజక్టర్ ఏర్పాటు కు నిధులు కేటాయిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, AMC చైర్మన్ దామోదర్ రావు, మండల రైతు బంధు కన్వీనర్ రవిందర్ రెడ్డి,PACS చైర్మన్ లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,జిల్లా రైతు బంధు సభ్యుడు బాల ముకుందాం, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ లు ఎల్లా గంగానర్సు రాజన్న, బోనగిరినారాయణ,సత్తమ్మ గంగారాం, రాజమని గంగాధర్,ఎంపీటీసీ భుపెళ్లి శ్రీనివాస్,జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, ఎమ్మార్వో దిలీప్,ఎంపీడీఓ రాజేశ్వరి,AO తిరుపతి,రైతు బంధు సమితి నాయకులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here