రైతుల విద్యుత్ మోటర్ల టార్గెట్… పైడిమడుగు లో విద్యుత్ మోటార్లు ధ్వంసం చేసిన దుండగులు..

0
468

  • విచారణ చేపట్టిన పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సతీష్

తాజా కబురు కోరుట్ల :వ్యవసాయ పనులకు ఉపయోగించే రైతులకు చెందిన కరెంటు మోటర్లు,పైపు లైన్లు,సామాగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చెయ్యటంతో పాటు మోటర్లు ఎత్తుకెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే…

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నిన్న రాత్రి పలువురి రైతులకు చెందిన కరెంటు మోటార్లు,పైపులు,విద్యుత్ సామగ్రీని గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు దాంతో పాటు కొందరి మోటర్లను ఎత్తుకెళ్లారు,సాతారం వెళ్లె ప్రాంతంలోని 11 మంది రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు,అయితె రైతులు నీటికోసం ఉపయోగించె కరెంటు మోటార్లను టార్గెట్ చేసిన దుండగులు ఈ ద్వంసానికి పాల్పడ్డారు,విషయం తెలుసుకున్న కోరుట్ల ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.గడిచిన సంవత్సర కాలంగా గ్రామంలో 90 వరకు కరెంటు మోటార్లు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ఇప్పుడు ఇలా మోటర్లను ధ్వంసం చెయ్యడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఒక్కొక్క రైతు సుమారు 20 నుండి 30 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులుఅంటున్నారు.పంటసాగుకు నీళ్లు అవసరం అని ఇప్పుడు ఇలా మోటర్లను ధ్వంసం చెయ్యటం వల్ల సాగు చెయ్యడం కష్టమని వాపోతున్నారు,ఇప్పటికైనా తమకు న్యాయం చెయ్యాలని వాళ్లు కోరుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here