తాజా కబురు జగిత్యాల:ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పరిసర ప్రాంత గ్రామాలు కట్లకుంట, కొండాపూర్,తొంబర్ రావు పేట, వల్లంపల్లి, వెంకటరావుపేట, పోరుమల్ల, విలయితాబాద్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 25 వేల మందికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మేడిపల్లి గ్రామ సర్పంచ్ క్యాతం వరలక్ష్మి మహేందర్ అభ్యర్థన మేరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని శనివారం ప్రారంభించనున్నట్లు ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ కు చెందిన డాక్టర్ చెన్నమనేని వికాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి తో పాటుగా అధికారులు, ఆసుపత్రి సిబ్బంది హాజరవుతారని ఆయన తెలిపారు.