రాయికల్ లో ప్రైవేటు ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీ

0
147

తాజా కబురు జగిత్యాల: రాయికల్ పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ చైతన్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల ప్రకారము అనుమతులు కలిగి ఉన్న ఆసుపత్రులలో మాత్రమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తులను చికిత్స నిమిత్తం చేర్చుకోవాలని నిబంధనలకు వ్యతిరేకంగా కరోనా పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని శ్రీ యసోద ప్రైవేట్ ఆస్పత్రికి మాత్రమే కరోనా చికిత్స కు అనుమతి ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here