రాయికల్ తాజా కబురు: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి తాత్కాలిక ఇండ్లు, రేకుల షెడ్లు పూర్తిగా ధ్వంసం కాగా పట్టణంలోని బాలికల పాఠశాల గేటు వద్ద ఉన్న బోర్డు విరిగి పడింది. రామాజీ పేట గ్రామానికి చెందిన రాయ ఎర్రయ్య, కనికరపు భూమక్క, చలిమెల రమేష్ ,భూపతిపూర్ గ్రామానికి చెందిన హలువల హన్మాండ్లు లకు సంబంధించిన రేకుల షెడ్లు పూర్తిగా ధ్వంసం కాగా పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడ్డాయి.