తాజా కబురు రాయికల్: పట్టణంలో T.U.F.I.D.C నిధుల నుండి 5 లక్షలతో శాలివాహన కుమ్మరిసంఘ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేసి,హరితహారం కార్యక్రమంలో భాగంగా కుమ్మరి సంఘ ప్రాంగణంలో జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ మొక్కలు నాటరు.అనంతరం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి నిత్యావసరాల నిమిత్తం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అశ్విని జాదవ్, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,వైస్ చైర్మన్ రమాదేవి,మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజీరెడ్డి, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మల్లారెడ్డి,కౌన్సిలర్లు,సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.