రాయికల్ న్యూ బస్ స్టాండ్ కి ఆర్.టీ.సి బస్సుల ప్రారంభం…?

0
338

బస్ లు నడుస్తాయని కరీంనగర్ రీజనల్ మేనేజర్ హామీ… ?
బస్ స్టాండ్ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ఆపివేయాలని వినతి.

తాజా కబురు జగిత్యాల: నాగిరెడ్డి రఘుపతి రెడ్డి (ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్) రాయికల్ మండల కేంద్రంలో రైతులు విరాళంగా ఇచ్చిన 2 ఎకరాల భూమిలో 2001 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఆర్.టీ.సి శాఖ మంత్రి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన,భూమిపూజ చేసి, 2002 సంవత్సరంలో మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసి ప్రయాణికుల సౌకర్యం కోసం బస్ ల రాకపోకలు జరిపి బస్టాండ్ ను ప్రజా ప్రయాణం కోసం వినియోగించారు. కాగా నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ జి.రవి బస్ స్టాండ్ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ పత్రిక ప్రకటన చేసారని,నిర్మాణ పనుల కోసం సంబంధిత అధికారులతో విచారణ జరిపించారని, బస్ స్టాండ్ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ఆపివేయాలని గత నెల 08వ తేదీన మాజీ సర్పంచ్ తురగ రాజిరెడ్డి,ప్రా.వ్య.సా.సంఘము మాజీ మాజీ ఛైర్మన్ పడిగెల రవీంధర్,స్థానిక భాజపా నాయకులు బొడుగం మోహన్ రెడ్డి, గాజంగి అశోక్ లు కరీంనగర్ ఆర్.టీ.సి రీజినల్ మేనేజర్, కోరుట్ల డిపో మేనేజర్ లకు ఫిర్యాదు చేస్తూ రాయికల్ మండల కేంద్రాన్ని కలుపుకొని జగిత్యాల,నిర్మల్, కోరుట్ల తదితర ప్రాంతాలకు సుమారు 100 ట్రిప్పుల బస్సులు రాయికల్ ద్వారా నడుపబడుతున్నాయని, బస్ స్టాండ్ నిర్మాణం కోసం రైతులు దానం చేసిన భూమిని ప్రజల సౌకర్యార్తం బస్సుల రాకపోకలకు మాత్రమే వినియోగించాలని కోరడంతో కరీంనగర్ ఆర్.టి.సి రీజనల్ మేనేజర్, కోరుట్ల డిపో మేనేజర్ శుక్రవారం రాయికల్ న్యూ బస్ స్టాండ్ ను పరిశీలించి స్థానిక ఫిర్యాదు దారులకు శనివారం నుండి ప్రతి బస్ న్యూ బస్ స్టాండ్ మీదుగా వెళుతుందని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భా.జ.పా జిల్లా కార్యవర్గ సభ్యులు తొగిటి లక్ష్మీనారాయణ, నాయకులు కుంభోజి రవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here