రాజన్నయాదిలో కోరుట్లలో వైయస్సార్ టీపి జెండా ఆవిష్కరణ…

0
29

తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాదిలో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు కో- కన్వీనర్ నేతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో లో వైయస్సార్ టిపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైన పాలన సాగింది అంటే అది కేవలం వైయస్సార్ హయాంలోనే  అని ,రానున్న రోజుల్లో ఆ పాలన కేవలం షర్మిల స్థాపించిన వైయస్సార్ టిపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాలన ఎంతో బాగుందని, తండ్రి అడుగుజాడల్లో తనయా,తనయుడు, ఎందరికో ఆదర్శంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమానికి  నిజామాబాదు పార్లమెంట్ కన్వీనర్ పాత్కూరి తిరుపతి రెడ్డి ,కృపాజ్యోతి రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు,గణ శీనివాసు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు..ఇదె విధంగా రహామత్‌పురా కు చెందిన సయ్యద్ అప్సర్,జిజాన్,సాజీద్, అన్వర్ ,అమేర్,ముదాసీర్,నాయకులు నవీన్,పోలాస వివేక్,గడ్డం సోమిరెడ్డి, అన్వేష్ తదితరులు పాల్గోన్నారు, ఈ సందర్భంగా రహామత్ పురా  కాలనీకి చెందిన సుమారు 30 మంది పార్టీలో చేరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here