మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్

0
161

రాయికల్ తాజా కబురు: వనాలు పెంచు-వానలు వచ్చు ….చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు… అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటిస్తూ ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు తన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటినారు. పట్టణంలో మొక్కలు నాటడం అత్యవసరమని ప్రతి ఒక్కరు మొక్క నాటాలని కోరారు. ప్రతి మున్సిపాలిటీ కి ప్రభుత్వం ఇస్తున్న నిధుల్లో 10శాతం గ్రీనరికే కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారని ఆయన అన్నారు.హరితహారంలో రాయికల్ ను ముందంజలో ఉంచుతామన్నారు.హరితహారం కార్యక్రమంలో ప్రజలను చైతన్యవంతులను చేసి ఉత్సాహంగా పండగ వాతావరణంలో మొక్కలు నాటుతామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here