నాకు విడాకులు ఇప్పించండని భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య
తాజా కబురు ఇబ్రహీంపట్నం: మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ కు చెందిన అరిఫాను గత 4 సంవత్సరాల క్రితం పెద్దల ఒప్పందంతో ఇబ్రహీంపట్నం మండలం గోదురు కు చెందిన సల్మాన్ తో వివాహం జరిగిందని అప్పటి నుండి తనను భర్త సల్మాన్ తో పాటుగా అత్త, మామ,మరిది మానసికంగా వేధింపులకు గురి చేయడంతో పెద్దల సమక్షంతో పంచాయితీలు జరిగిన అతనిలో మార్పు రాకపోవడంతో మెట్పల్లి పోలీస్ ఠాణాలో కూడా పిర్యాదు చేసింది అరిఫా అప్పటి నుండి పుట్టింటిలో ఉంటున్నాని తనకు తెలియకుండానే రెండవ పెళ్లి చేసుకొని ఆమెను సైతం హింసించడంతో 2వ భార్య కూడా పుట్టింటికి వెళ్లడంతో గత 10 రోజుల క్రితం సల్మాన్ 3వ పెళ్లి చేసుకున్నాడని తెలిసి అతన్ని నిలదీయగా నా ఇష్టం వచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకుంటా ఎవరు నన్ను ఏంచేయలేరు అంటూ దాబాయిస్తున్నాడని తనకు జరిగిన అన్యాయానికి నిరసనగా మంగళవారం నుండి భర్త ఇంటి ముందు (టెంట్ వేసి) న్యాయపోరాటం (దీక్షా) చేస్తున్నాని బైఠాయించింది.