మానవత్వం చాటిన కోరుట్ల కోర్టు మెజిస్ట్రేట్

0
55

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని దమ్మన్న పేట కు చెందిన చిట్టి తల్లి నవనీత దీన స్థితిని తెలుసుకున్న కోరుట్ల మెజిస్ట్రేట్ శ్యామ్ కుమార్ గురువారం దమ్మన్నపేట గ్రామానికి వచ్చి నవనీత కు నోట్ పుస్తకాలు,బ్యాగులు,పెన్నులు,పెన్సిల్, పండ్లు, బట్టలతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. అధైర్య పడవద్దని ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారని ధైర్యంతో ఉన్నత చదువులు చదివి ముందుకు పోవాలని సూచించారు. అనాధ పిల్లలకు కోర్టులు కూడా అండగా ఉంటాయన్నారు. ఆయన వెంట కోరుట్ల ఏజిపి కటకం రాజేంద్రప్రసాద్,సర్పంచ్ కాచర్ల సురేష్,పంచాయతీ కార్యదర్శి రవి రాజు, హెచ్ఎం రాజులతో పాటు గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here