భైంసా అల్లర్ల కేసులో హిందువులపై ఉద్దేశపూర్వకంగానే పీడీ యాక్ట్,నా న్బెయిలబుల్ కేసులు నమోదు-సోయం బాపు రావు ఆదిలాబాద్ ఎం.పి

0
83

తాజా కబురు డెస్క్: భైంసా అల్లర్ల కేసులో హిందువులపై ఉద్దేశపూర్వకంగానే పీడీ యాక్ట్, నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని, అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు.

భైంసా అల్లర్ల ఘటనపై నిష్పక్షపాతంగావ్యవహరించాల్సిన పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా హిందువులపై కేసులు నమోదు చేయడం పట్ల ఖండించారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం హిందూ వర్గం వారిపైనే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తూ అసలు నిందితులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

బైoసా అల్లర్ల ఘటనపై ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి హోంశాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించగా అక్కడ రక్షణ కోసం ప్రత్యేక పోలీసు బలగాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిందని, సత్వరం విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని సోయం బాపురావు కోరారు.

పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సోయం బాపురావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here