
తాజా కబురు రాయికల్ క్రైం: పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా ప్రాంతంలోని అరిపెల్లి లక్ష్మి (45)ని ఆమే భర్త సత్తయ్య కుటుంబ కలహాలతో పదునైన ఆయుధంతో ఆదివారం గొంతుకోసి హతమార్చి పరారయ్యాడు. కాగా నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రాయికల్ శివారులో సోమవారం మధ్యాహ్నం నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సీఐ రాజేష్, ఎస్ఐ ఆరోగ్యం లు ఒక ప్రకటనలో తెలిపారు.