భగ్గుమన్న దళిత సంఘం.. ఈటల బావమరిది దిష్టి బొమ్మ దగ్ధం

0
22
Tajakaburu
Tajakaburu

తాజాకబురు ప్రతినిధి:దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి శవయాత్ర నిర్వహించింది హుజురాబాద్ పట్టణంలోని దళిత సంఘం. ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద మధుసూదన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.

ఈటెల దళిత ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన కుటుంబం పైన కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.త్వరలో జరగబోయే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల కుటుంబ సభ్యుడైన మధుసూదన్ రెడ్డి దళితుల గురించి అసభ్యంగా మాట్లాడుతూ దూషించాడు. ఈటల రాజేందర్ భార్య జమునా రెడ్డి సోదరుడు కొండవీటి మధుసూదన్ రెడ్డి… ఈటల పార్టనర్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ బయటికి వచ్చింది. ఎన్నికల ప్రచార తీరు.. పబ్లిసిటీ.. దళిత బంధు పథకం ఎఫెక్ట్ పలు విషయాలపై చర్చించిన మధుసూదన్ రెడ్డి మాదిగలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాళ్లని నమ్మలేమంటూ కులం పేరుతో దూషిస్తూ, నీచమైన భాష ఉపయోగించడం దుమారానికి దారితీస్తోంది. నియోజకవర్గంలో 45 వేల ఓట్ల వరకూ దళితులు ఉన్నారని.. దళిత బంధు పథకంతో ఓడిపోతామన్న భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ చాట్‌ లీక్‌తో ఈటల భవితవ్యం ఎటు తిరగనుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here