హుస్నాబాద్ తాజా కబురు:బిజెవైఎం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బొప్పిశెట్టి భీమేష్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్ బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి కర్ణకంటి నరేష్ హాజరయ్యారు. హుస్నాబాద్ పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రోజున బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు బొంగొని సురేష్ గౌడ్ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా టీక వేసుకుంటున్న వారికి covid-19 సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి టీకా వేసుకున్న వారికి పండ్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు టీకా వేసుకున్న వారికి తగు సూచనలు చేశారు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారి సారధ్యంలో వ్యాక్సిన్ తయారీ ని ప్రోత్సహిస్తూ కరోనా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా భారతదేశానికి దక్కిందని వారు అన్నారు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి చేతులను శుభ్రపరుచుకుని భౌతిక దూరం పాటిస్తూ కరొన మహమ్మారిని నియంత్రించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, బిజెపి హుస్నాబాద్ మండల అధ్యక్షుడు చెక్క బండి విద్యాసాగర్ రెడ్డి, హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య , బొల్లి శ్రీనివాస్, బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కన్నోజు వినయ్, సీనియర్ నాయకులు కవ్వా వేణుగోపాల్ రెడ్డి, శ్రీవిద్య బీజేవైఎం హుస్నాబాద్ అక్కన్నపేట మండల అధ్యక్షులు జాఫ శ్రావణ్ , కొయ్యడ కార్తీక్, బీజేవైఎం టౌన్ ఉపాధ్యక్షులు ప్రతాపగిరి రాము, కంసని రాము, కార్యదర్శి లక్ష్మణ్, బీజేవైఎం అక్కన్నపేట మండల ప్రధాన కార్యదర్శి గోపగోని అరవింద్, ఉపాధ్యక్షుడు చిలుకూరి ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Latest article
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...