రాయికల్ తాజా కబురు:రాయికల్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో సోమవారం బాలల సంరక్షణ కోసం జగిత్యాల సి ఐ రాజేష్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాలలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు, బాలల ముఖ్య చట్టాలు, బాలల వేధింపులు, హింస, ఆకృత్యాల నుంచి తమను తాము రక్షించుకోలేరు. పైగా తాము ఇలా వేధింపులకు గురి అవుతున్నాము అన్న విషయాన్ని గుర్తించే ఆలోచన స్థాయి కూడా వారికి ఉండకపోవచ్చని, స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి మనకు ఎదురయ్యే ప్రమాదాల గురించి అక్కడ జీవించే పెద్దలకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి పిల్లలపై వేధింపులు జరిగిన, అత్యాచారాలు చోటు చేసుకున్న పోలీసులు కన్నా ముందుగా తెలుసుకోగలిగేది స్థానికులని, వేధింపులు జరిగే ప్రాంతాలను వేధింపులకు పాల్పడగలిగే వ్యక్తులను ముందే గుర్తించి వారి నుంచి పిల్లలను రక్షించ గలిగేది కూడా స్థానికులు అని, పిల్లలను రక్షించే విషయంలో వ్యక్తులుగా వారు కొన్ని పరిమితులకు లోబడి ఉంటారని, సంఘటితంగా వార్డ్ మొత్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటే అందరూ సమిష్టి కృషి చేసి ప్రతి వార్డ్ లోనూ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో MRO మహేశ్వర్ ,SI ఆరోగ్యం, మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ రమాదేవి, కౌన్సిలర్లు కాంతారావు, మహేందర్, సాయి కుమార్, శ్రీధర్,మహేష్ ,అన్వరీ బేగం ,మరియు అంగన్వాడీ ANM లు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...