తాజా కబురు జగిత్యాల,రాయికల్: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు వ్యక్తి గత శుభ్రత తో పాటుగా మన పరిసరాలను పరిశుభ్రపర్చుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిని,చెత్తను తొలగించారు.
జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ వారి నివాసంలోని నిల్వ ఉన్న నీటిని తొలిగించి, పరిసరాలను అనంతరం ఇంటి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాలను,తొలగించడం ద్వారా వర్ష కాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు.
రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు తన నివాసంలోని నిల్వ ఉన్న నీటిని తొలిగించి పులా కుండీలలో పొడిమట్టిని నింపారు.