ప్రతిమ ఫౌండేషన్ సేవలు అభినందనీయం-ఎం.పి.పి సంధ్యారాణి

0
190

తాజా కబురు రాయికల్ రూరల్ : మండలంలోని మూటపెల్లి, కొత్తపేట గ్రామాల్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మండల ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి మాస్కులను పంపిణి చేశారు. కొత్తపేట గ్రామంలో ఎం.పి.పి లావుడ్య సంధ్యారాణి మాస్కుల పంపిణీని ప్రాంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రతి ఒక్కరికి మాస్కుల ఉపయోగం చాల అవసరమని, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఫౌండేషన్ ద్వారా మాస్కులను పంపిణి చేయడం అభినందనీయమని, మాస్కులు ధరించియేటపుడు జాగ్రత్త వహించాలని, ఒకవైపు మాత్రమే మాస్కులను వాడాలని అవగాహనా కల్పించారు అన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయితీ కార్యదర్శి జి. మౌనిక ,ఎంపిటిసి మందుల శ్రీనివాస్ ,ఆయా గ్రామాల సర్పంచులు బెక్కెం తిరుపతి, బత్తిని రాజేశం, ఉప సర్పంచ్ లు చొప్పరి రంజిత్, కాటిపెల్లి రాజశేఖర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here