మహబూబ్ నగర్ తాజా కబురు: జిల్లా వ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే క్రమంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న అక్రిడిటేషన్ గల జర్నలిస్టులకు, జిల్లా అక్రిడేషన్ కమిటీ ద్వారా జిల్లా పోలీసు శాఖ నాణ్యమైన మాస్కులు, సానిటైజర్లు అందజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్.పి. రమా రాజేశ్వరి అక్రిడేషన్ కమిటీ సభ్యులకు మాస్కులు, సానిటైజర్లు అందిస్తూ, జిల్లాలోని మిగతా పాత్రికేయ సోదరులకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో ఎస్.పి. మాట్లాడుతూ, కరోనా వ్యాధికారక వైరస్ ప్రబలకుండా చేయటంలో అధికారులు, పోలీసులు ఎంత కృషి చేస్తున్నారో అదేస్థాయిలో మీడియా ప్రతినిధుల కష్టం కూడా ఉన్నదని ప్రశంసించారు. అందరి కృషి వల్లే మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని పేర్కొన్నారు. అయినా కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో జర్నలిస్టులు మరింత శ్రద్ధగా పాటుపడాలని సూచించారు. వార్తా సేకరణలో భాగంగా ముంబాయిలో దాదాపు 70 మంది జర్నలిస్టులకు, కొంతమంది పోలీసులకు కరోనా వ్యాధి సోకడం బాధాకరమని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని జర్నలిస్టులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.పి. కోరారు. తమ జర్నలిస్టుల క్షేమం పట్ల ఎస్.పి. గారి శ్రద్దకు జర్నలిస్టు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ సభ్యులు జక్కీ, బస్వరాజ్, సంతోష్, బండి విజయ్, వెంకటేశ్వర్ రావు, భాస్కరాచారి, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...