పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా జగిత్యాల లో కాంగ్రెస్ నిరసన

0
57

జగిత్యాల తాజా కబురు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా శుక్రవారం జగిత్యాలలో డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు.జీవన్ రెడ్డి ఇంటి నుంచి నాయకులు తహశీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు శాంతియుతoగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతుండగా పోలీసులు నాయకులను అరెస్ట్ చేస్తుండగా నాయకులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్యాతోపులట జరిగింది.దీంతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధుతో పాటుగా రఘువీరు గౌడ్ కు గాయాలు అయ్యాయి.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురికాగా పోలీసుల వైఖరిని ఎమ్మెల్సీ ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలను వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటి జగదీశ్వర్, బoడ శంకర్, తాటిపర్తి విజయలక్ష్మి,దుర్గయ్య,మసర్థి రమేష్, తాటిపర్తి శోభారాణి,గాజుల రాజేందర్,మన్సూర్ అలీ,బింగి రవి, ముస్కు నిశాంత్ రెడ్డి,పులి రామ్, కొండ్ర రామచంద్ర రెడ్డి, కోర్టు శ్రీనివాస్, రమేష్ రావు,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు,రవీందర్ రెడ్డి, రమణ,రఘువీర్ గౌడ్, విజయ్, శంకర్, శరత్ రెడ్డి, నరేష్, శంకర్, చారి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here