రాయికల్ తాజా కబురు: పట్టణప్రగతి లో భాగంగా 4 వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు సందర్శించారు. నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చూడాలని వార్డు ప్రజలను కోరారు.ప్రజలను సమస్యలు అడిగి వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం 12వ వార్డులో గల ఖాళీ ప్రదేశంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్తను బ్లేడ్ ట్రాక్టర్ తో తీసివేయించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.