పట్టా ఉంది కానీ భూమి కబ్జా చేశారంటూ ధర్నా

0
113

తాజా కబురు రాయికల్: మండలంలోని కట్కాపూర్ గ్రామానికి చెందిన దళితులు సోమవారం రాయికల్ నుండి జగిత్యాలకు వెళ్లే రహదారిపై ధర్నాకు కూర్చున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 377/116 లో ప్రభుత్వం గతంలో దళితులకు భూమిని కేటాయించిందని అట్టి సర్వేనెంబర్ గల భూభాగంలో పట్టా ఉన్నప్పటికీ ఇతరులు పంటలు వేస్తూ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఆరోగ్యం గ్రామస్తులకు నచ్చజెప్పి తహసిల్దార్ కార్యాలయానికి తీసుకుని వెళ్లగా తాహసిల్దార్ మహేశ్వర్ మాట్లాడుతూ మోక పై వచ్చి విచారించి న్యాయం చేస్తామని నిరసనకారులకు తెలిపడంతో ఆందోళన విరమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here