రాయికల్ తాజా కబురు: మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా పివి చిత్ర పటానికి పూల మల వేసి ఘనంగా నివాళులు అర్పించి, 6వ విడత హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.
రాయికల్ పట్టణంలో 10 లక్షల రూపాయలతో మురుగు కాలువల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం 1 కోటి 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన రాయికల్ నుండి ఇటిక్యాల లింక్ రోడ్డు ను ప్రారంభించారు.
మండలంలోని వస్తాపూర్ గ్రామ సర్పంచ్ కోల సుమలత భర్త రాజలింగం ఇటీవల అనారోగ్యంతో మరణించగా 5 లక్షల రైతు భీమా ప్రొసీడింగ్ కాపీ ని సర్పంచ్ కోల సుమలతకు అందజేసారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద హరితహారం లో భాగంగా మొక్కలను నాటారు.