తాజా కబురు జగిత్యాల: స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నివాసంలో పాత్రికేయుల సమావేశంలో భాగంగా ఇలా అన్నారు.దేశంలో ఆయుస్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పొందడానికి ప్రతి పౌరుడు హక్కు కలిగి ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కరోన సేవల కోసం ప్రయివేట్ హాస్పిటల్ కి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ధరలు అమలు చేయడం లేదు. అన్నింటికీ ఒకే వైద్యం క్వరంటాయిన్ అనే స్థాయికి ప్రభుత్వం దిగజారింది. ప్రభుత్వ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందించక పోవడం చాలా బాధకరం. ఆత్మహత్య చేసుకోవడం మన దేశంలో నేరం అలాంటిది చెస్ట్ హాస్పిటల్ లో అసలు ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదు అనే క్లారిటీ ఇవ్వకుండా ఆరోగ్య శాఖ మంత్రి సెల్ఫీ వీడియోను తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి కి ఏమయినా నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయాలి ఈ విషయం లో ఇంతవరకు స్పందన లేదు.కేంద్రప్రభుత్వం కరోన ఆరంభంలో అమెరికా ట్రంప్ పర్యటనలో భాగంగా ఒక నెల జాప్యం చేశారు.దేశంలో రాజకీయ ప్రజనాల కోసం తప్ప ప్రజల విషయం లో ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదు.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పరసీటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనటం ఎంత వరకు సమంజసం. ముందైతే మన ప్రాణాలు కాపాడుకుంటే చాలు తర్వాత మన ఆర్థిక పరిస్థితి చూద్దాం అన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరోన విషయంలో పరిస్థితి స్వీయ నియంత్రణ కు వచ్చింది.పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి నిరుపేద కుటుంబం పై భారం పడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.ఉపాధి కూలీలా కోసం 8 గంటల వరకు ముందు పని కల్పించండి.గత వారం రోజులు రాష్ట్రంలో కరోన పరీక్షలే నిర్వహించలేదు ఇప్పుడు మొదలు పెట్టారు.ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి కూడా ప్రభుత్వ మే చెల్లించాలి ఇది రాజ్యాంగ హక్కు.బలవన్మరణానికి పాల్పడిన వారి సంబంధించి మానవ హక్కుల కమిషన్ సోమోటో గా పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలి.రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో విద్యా, వైద్యం, ఉపాధి హక్కు తో పాటు జీవించే హక్కు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవించే హక్కు కోల్పోతున్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేష జాడలు వీడండి.ఆయుస్మాన్ భారత్ తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలి. 6 am to 6 pm వరకు అత్యవసర సేవలు మినహా కఠిన లాక్ డౌన్ అమలు చేయండి .వ్యాపార సంస్థలను, వైన్ షాప్, బెల్ట్ షాప్ లను 4 గంటల వరకు బందు చేయించండి.
Latest article
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...
విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?
గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు
తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు...