నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్ల తో జోరుగా ఇసుక రవాణా

0
73

జగిత్యాల తాజా కబురు( జర్నలిస్ట్ ఫ్రీలాన్సర్- నాగిరెడ్డి రఘుపతి) : జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. మండలంలోని ఇటిక్యాల,బోర్నపెల్లి, జగన్నాథ్ పూర్ గ్రామాల నుండి నిత్యం ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్ల తో జోరుగా ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ పేరుకే ఒకటి రెండు ట్రాక్టర్లను పట్టుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఇటిక్యాల వాగు, జగన్నాథ్ పూర్, బోర్నపెల్లి గోదావరి పరిసరాల నుండి నిత్యం పెద్ద మొత్తములో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, ఇంటి నిర్మాణాలు చేసుకునే వారికి అనుమతితో ప్రభుత్వ నిర్ణిత రుసుముతో ఇసుక సరఫరా జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here