నాటు నాటు సారా తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

0
154

జగిత్యాల రూరల్: నాటు సారా రవాణా చేస్తున్నారనే సమాచారం తో జగిత్యాల ఎక్సైజ్ శాఖ సిఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున గుల్లపేట నుండి అనంతారం వెళ్లే రోడ్ లో వాహన తనిఖీలు నిర్వహించగా నాటు సారా తరలిస్తున్న తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనoపై 30 లీటర్ల నాటుసారా తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తి పైకేసు నమోదు చేసినట్లు తెలిపారు.అతడు సారంగపూర్ మండలం రంగపేట గ్రామం నుండి నాటు సారా తీసుకువస్తున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీలో ఎస్ఐ నరేష్ రెడ్డి, సిబ్బంది రాజశేఖర్, శ్రీనివాస్, బీర్బల్, మహేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here