నాటిన ప్రతి మొక్క ను సంరక్షిస్తాం- మున్సిపల్ చైర్మన్

0
79

రాయికల్ తాజా కబురు: ఆరవ విడత హరితహారంలో భాగంగా రాయికల్ పట్టణం లోని 2వ వార్డ్ కౌన్సిలర్ కన్నాక మహేందర్ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు మాట్లాడుతూ ప్రతి వార్డులో మొక్కలను నాటీ, ప్రతిరోజు వాటర్ ట్యాంక్ ద్వార చెట్లకు నీరు పోస్తూ, సంరక్షణ భాద్యతలు చేపడుతూ ఆకుపచ్చ రాయికల్ ద్యేయంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రమాదేవి, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్ రెడ్డి,వల్లకొండ మహేష్ గౌడ్, తెరాస మండల యూత్ అధ్యక్షులు ఎలిగేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here