దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ :జిల్లా ఎస్పీ సింధు శర్మ

0
31

జగిత్యాల తాజా కబురు: ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసి, యావత్ ప్రపంచానికి బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు.దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి భారతదేశానికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని చాటిన మహోన్నత దేశ నాయకుడన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఓటు హక్కు గొప్పతనం, ప్రజలే పాలకులను ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు.డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా అందరూ నడుచుకోవాలని,ఆయనను ఆదర్శంగా,స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ ప్రతాప్, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్స్ వామనమూర్తి, నవీన్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here