తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గా తాళ్ల పెళ్లి సత్యనారాయణ గౌడ్ నియామకం

0
28

జగిత్యాల తాజా కబురు: తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ గా కోరుట్ల పట్టణానికి చెందిన తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు,నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ గా నియమితులైన తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యార్థి,నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తూ జేఏసీ బలోపేతానికి తన వంతు బాధ్యతతో నిరుద్యోగుల సమస్యలకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో నియామకం చేసిన తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ కు,సహకరించిన న్యాయవాది శేర్ నర్సారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here