తాజాకబురు కరీంనగర్:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హారితహారం తెలంగాణ సంపద అని, రాష్ర్టమంత పచ్చధనం చెయ్యటం కోసమె ఈ గొప్ప కార్యంకు శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.సీటీసీలో యాదాద్రి విధానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. లా ఆండ్ ఆర్డర్ కాపాడడమే కాకుండా పలు వినూత్న కార్యక్రమాలతో కరీంనగర్ పోలీసులు ఉనికి చాటుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు. గతంలో మియావాకీ ఫేజ్ వన్ కింద పన్నెండున్నర వేల మొక్కలు నాటిన ఖాకీలు.. ఫేజ్ టూకి సిద్ధమయ్యారు.

మంత్రి కమలాకర్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఎకరం పావు భూమిలో 14,800 మొక్కలు నాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఫేజ్ టూని ప్రారంభిస్తూ మంత్రి గంగుల మొక్కలు నాటారు. మంత్రితోపాటు… పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. యాదాద్రి విధానంలో ఇప్పటికే నాటిన మొక్కలను పరిశీలించారు. కరీంనగరాన్ని చక్కటి వనంగా పోలీసులు మారుస్తున్నారని మంత్రి అన్నారు.
చక్కటి వనాలను కరీంనగర్ పోలీసులు కానుకగా ఇస్తున్నారని మంత్రి ప్రశంసించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రోత్సాహంతో, అధికారుల సహకారంతో ప్లాంటేషన్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నామని సీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ శశాంక, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజే అక్బర్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, సుడా ఛైర్మన్ జీవీ రామక్రిష్ణారావు, కమిషనర్ క్రాంతి, ట్రైనీ ఐపీఎస్ రష్మీ, ట్రైనీ ఐఏఎస్ అంకిత్, కొత్తపల్లి మునిసిపల్ చైర్మన్ రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.