తాట్లవాయి లో బోనాలు

0
76

రాయికల్ తాజా కబురు: మండలంలోని తాట్లవాయి గ్రామంలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్దలతో కొత్తకుండలో నైవేద్యం వండి,చిన్నముంతలో పానకం పోసి, దానిపై దివ్వే పెట్టి బోనంజ్యోతి వెలిగించి కన్నులపండుగగా డప్పు చప్పుళ్లతో,ప్రదర్శనగా అమ్మవారికి భోనాలు సమర్పించారు.ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమం లో నవదుర్గ సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here