రాయికల్ తాజా కబురు:మండలంలోని కొత్తపేట అటవి ప్రాంతంలో వారం రోజుల క్రితం అక్రమంగా చెట్లను నరికివేసిన విషయంలో శుక్రవారం రాయికల్ అటవీశాఖ అధికారులు కొత్తపేట్, వడ్డెర కాలనిలో తనిఖీలు చేయగా సుమారు లక్షా పదివేలు రూపాయల విలువ గల టేకు కలపను స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో అటవీశాఖ అధికారి కలీలోద్దీన్, డిఆర్.ఓ జె.శ్రీనివాస్ ఎఫ్.ఎస్.ఓ అఫ్జల్ హుస్సేన్, సిబ్బంది
శ్రీనివాస్.రవీందర్, సతీష్ పాల్గొన్నారు.