జగిత్యాల తాజా కబురు కలెక్టరేట్: కథలాపూర్ మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ , పౌర మానవ హక్కుల సంస్థ ప్రతినిధి పాయికరి నరేష్ సెప్టెంబర్ 8వ తేదీన మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం కు 11 అంశాల సమాచారం కోసం రిజిస్టర్ పోస్టు ద్వారా స.హ దరఖాస్తు చేశారు. తాను కోరిన సమాచారం జన్నారం మండలం కమన్ పల్లి గ్రామానికి సంబంధించినది కావడం తో సంబంధిత గ్రామ సర్పంచ్ యొక్క భర్తకు తన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేశారంటూ, సహ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజా సమాచార అధికారి మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి పై సహ చట్టాన్ని అనుసరించి తగు చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలంటూ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
