జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ

0
58

జగిత్యాల తాజా కబురు క్రైమ్:వార్షిక తనిఖీలో భాగంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ.ఇందులో భాగంగా పెండింగ్ ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి, మరియు పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను సి.ఐ ని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణను, 5s అమలు చేసిన తీరును,వివిధ వర్టికల్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తో వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షన్ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. అంతరం రికార్డుల ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా సిస్టం, ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.40 సంవత్సరాల కంటే పైబడిన సిబ్బంది మెడికల్ చెక్అప్ చేయించుకోవాలని సూచించారు.అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను తనిఖీ చేశారు. తనిఖీలో డీఎస్పీ వెంకటరమణ,టౌన్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి ,ఎస్.ఐలు రాంనాయక్, శంకర్ నాయక్, మహేందర్, ట్రాఫిక్ ఎస్.ఐ అనిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here