జగిత్యాల జిల్లాలో 21 దొంగతనం కేసులను చేదించిన ప్రత్యేక పోలీసు బృందం

0
79

పోలీసులకు రివార్డులు అందజేసిన ఎస్పీ సింధు శర్మ

తాజా కబురు జగిత్యాల:జగిత్యాల జిల్లాలోని అనేక ప్రాంతాలలో గత కొంత కాలంగా జరుగుతున్న వరుస దొంగతనాలకు సంబంధించి శనివారం తెల్లవారు జామున కోరుట్ల పోలీసులు నిందితుడిని పట్టుకుని అతని నుండి భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణములు స్వాధీనపర్చుకున్నారు.వివరముల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లాలోనిఇబ్రహీంపట్నం,మెట్పల్లి,కోరుట్ల,మేడిపల్లి,జగిత్యాల,రాయకల్, సారంగాపూర్,ధర్మపురి మండలములోని పలు ప్రాంతములలో గత కొంత కాలంగా రాత్రి సమయంలో తాళము వేసి ఉన్న ఇండ్ల తాళములు పగలగొట్టి భారీ దొంగతనములు జరుగుచున్నవి. అదే విధంగా రాత్రి సమయంలో ఇంటివద్ద నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి బంగారుగొలుసులు సైతం దోపిడి జరిగినవి. ఈనేరములకు సంబంధించి జిల్లాలో గత కొంత కాలంగా 21 కి పైగా చోరి కేసులు, దోపిడీ కేసులు నమోదు అయినట్లు ఈ కేసులకు సంబంధించి జిల్లాలో కోరుట్ల సి. ఐ. రాజ శేఖర్ రాజు, మేడిపల్లి ఎస్.ఐ.సుదీర్ రావు, కోరుట్ల ఎస్. ఐ. సతీష్, కథలాపూర్ ఎస్. ఐ. పుత్విధర్ గౌడ్, మరికొంత మంది అధికారులు ప్రత్యేక బృందంగాఏర్పడి గత కొంత కాలంగా ఈ దొంగతనం కేసులను చేదించుటకు శ్రమించగా శనివారం తెల్లవారు జామునఇట్టి కేసులకు సంబంధించి ప్రత్యేక బృందం కోరుట్ల పట్టణ శివరులో నిందితుడు పండారి బాలు పవర్, (34)ఎస్టం గ్రామం ఔరంగాబాద్ కు చెందినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి జిల్లాలో జరిగిన పలు దొంగతనములకు సంబంధించి 1 కిలో 60 గ్రాముల బంగారుఆభరణాలు,55లక్షలు విలువ గలవి,1కిలో 310 గ్రాముల వెండి ఆభరణాలు 1లక్ష రూ.విలవ గలవి మొత్తం విలువ 56 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.
నిందితుడు పండరి బాలు పవర్ అందాద 2014 సం. నుండి మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలలో పలు
దొంగతనములు చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని,కాగ ప్రత్యేక బృందం నిందితుడు ఇతర జిల్లాల్లో, రాష్ట్రాలలో చేసిన నేరములకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టి నిందితుడిపై శనివారం రిమాండ్ నిమిత్తం కోర్టులోహాజరు పరిచి పోలీసు కస్టడీలోకి తీసికుని విచారణ వేగవంతం చేయనున్నట్లు, ఎస్పీ తెలిపారు. జిల్లాలో 21 దొంగతనం కేసులను చేదించిన
ప్రత్యేక బృందం కోరుట్ల సి. ఐ. రాజ శేఖర్ రాజు,
మేడిపల్లి ఎస్.ఐ.సుదీర రావు, కోరుట్ల ఎస్. ఐ. సతీష్, కథలాపూర్ ఎస్. ఐ.పుత్విదర్ గౌడ్,ఎస్. ఐ. రాజప్రమీల, పి.ఎస్.ఐ శ్వేత, సురేష్, ఏఎస్.ఐ వీరస్వామి, హెచ్ సి శ్రీనివాస్, కానిస్టేబుల్స్ షమి, పురుపోత్తం, టెక్నికల్ టీం మహేష్, మల్లేష్, రాజేష్, లను అభినందించి ప్రత్యేక రివార్డులనుఅందజేసినట్లు ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here