జగిత్యాల కలెక్టర్ నేడు మొక్కతో సెల్పీ ఎందుకు తీసుకున్నారో తెలుసా…?

0
102

తాజా కబురు జగిత్యాల టౌన్:తెలంగాణకు హరితహారం కార్యక్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యుడు జోగినపెల్లి  సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటడంతో పాటు వారు మరో ముగ్గరి పేర్లను ప్రతిపాధిస్తూ వారు కూడా మూడు మొక్కలను నాటే విధంగా గ్రీన్ చాలెంజ్ ను ఇవ్వాలనె సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా. ఏ. శరత్ స్వీకరించి జిల్లా కలెక్టర్  జి. రవి పేరును ప్రతిపాదించారు. చాలెంజ్ ను  స్వీకరించిన జిల్లా కలెక్టర్ రవి క్యాంపు కార్యాలయంలో  బాదం మొక్కలను నాటి వాటి సంరక్షణ బాద్యతలను చేపట్టడంతోపాటు జగిత్యాల అడిషనల్ ఎస్పి దక్షిణామూర్తి, సంయుక్త కలెక్టర్ బి. రాజేశం, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడిస్  అరుణశ్రీ గార్లకు ప్రతిపాదిస్తు వారు కూడా ముగ్గురు మూడు మొక్కలను నాటడంతో పాటు, మరో ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here