ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

0
185

రాయికల్ తాజా కబురు: పట్టణంలోని శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్షులు కన్న వేని రాజేందర్ కాషాయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘమిత్ర సభ్యులు ఎద్దండి రాజు మాట్లాడుతూ జేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడు అటునవంటి రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. వ్యక్తిగత శీలము, జాతీయ శీలం కలిగిన శివాజీని ఆదర్శంగా తీసుకుని యువత ఆచరణాత్మకంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ నారాయణరెడ్డి, కుర్మా మల్లారెడ్డి, జలపతి రెడ్డి, ఎద్దండి దివాకర్, మహిపాల్, గంగారెడ్డి, రవి, మల్లారెడ్డి, జలంధర్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here