గ్రామీణ వైద్యులను, తపాలా ఉద్యోగులను సన్మానించిన రాయికల్ లయన్స్

0
18

తాజా కబురు జగిత్యాల: గురువారం అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ వైద్యులను రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జడ్.సి మ్యాకల రమేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వైద్యులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారని వైద్య వృత్తి చాలా గొప్పదని అన్నారు.
అనంతరం అంతర్జాతీయ పోస్టల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తపాలా ఉద్యోగులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో బత్తిని భూమయ్య ,డి.సి కాటిపెళ్లి రాంరెడ్డి,అధ్యక్షులు దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి రంజిత్ కుమార్, కోశాధికారి బొమ్మకంటి నవీన్ కుమార్,లయన్స్ క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్,బొడుగం అంజిరెడ్డి,దాసరి రామస్వామి, మరి పెళ్లి శ్రీనివాస్ గౌడ్,కడకుంట్ల నరేష్,మొసారపు శ్రీకాంత్,వాసం రాంప్రసాద్,గంట్యాల ప్రవీణ్ ,శివ ప్రసాద్, గ్రామీణ వైద్యులు పిప్పోజి మహేందర్ బాబు ,శ్రీనివాస్,శంకర్ ,గోవర్ధన్ పోస్టల్ ఉద్యోగులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here